క్రికెట్‌ చరిత్రలోనే సంచలన క్యాచ్‌.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్‌ | Trent Boult takes a one-handed stunner to dismiss Laurie Evans | Sakshi
Sakshi News home page

LLT 20 2024: క్రికెట్‌ చరిత్రలోనే సంచలన క్యాచ్‌.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్‌

Jan 29 2024 3:08 PM | Updated on Jan 29 2024 3:52 PM

Trent Boult takes a one-handed stunner to dismiss Laurie Evans  - Sakshi

ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్ రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు.  అబుదాబి బ్యాటర్‌ లారీ ఎవాన్స్‌ను సంచలన క్యాచ్‌తో బౌల్ట్‌ పెవిలియన్‌కు పంపాడు. అబుదాబి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్‌ ఆఫ్‌లో ఉన్న బౌల్ట్‌ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బౌల్ట్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో  ఎంఐ ఎమిరేట్స్‌ విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement