సికిందర్‌ రజా విధ్వంసం.. కేవలం 24 బంతుల్లోనే | Abu Dhabi Knight Riders beat Sharjah Warriorz by 3 runs | Sakshi
Sakshi News home page

సికిందర్‌ రజా విధ్వంసం.. కేవలం 24 బంతుల్లోనే

Nov 29 2026 9:17 PM | Updated on Nov 29 2026 9:39 PM

Abu Dhabi Knight Riders beat Sharjah Warriorz by 3 runs

ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2026లో అబుదాబి నైట్ రైడర్స్ మ‌రో అద్భుత విజయాన్ని న‌మోదు చేసింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై అబుదాబి 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబి నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ (4) త్వరగానే ఔటైనప్పటికీ.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (26 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోలిన్ మున్రో (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) షార్జా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 

వీరిద్దరూ రెండో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో అలీషన్ షరాఫు (10 బంతుల్లో 23), గుల్బాడిన్ నైబ్ (26 నాటౌట్), కెప్టెన్ జాసన్ హోల్డర్ (6 బంతుల్లో 18) వేగంగా ఆడారు.

ర‌జా మెరుపులు వృథా
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (49), పాల్ వాల్టర్ (24) శుభారంభం అందించారు. మిడిల్‌ ఓవర్లలో యువ బ్యాటర్ జేమ్స్ రెవ్ (28 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రాజా (24 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత పోరాటం కనబరిచారు. వీరిద్దరూ అజేయంగా 73 పరుగుల భాగస్వామ్యం జోడించి జట్టును గెలుపు అంచుల వరకు తీసుకెళ్లారు.  

చివరి ఓవర్‌లో డ్రామా
షార్జా విజయానికి చివరి ఓవర్లో 25 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న జేమ్స్ రెవ్, సికందర్ రాజా భారీ షాట్లతో విరుచుకుపడి ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టారు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టినప్పటికీ షార్జా.. 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

అబుదాబి బౌలర్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ 2 వికెట్లు పడగొట్టగా, అమ్షి డి సిల్వా ఒక వికెట్ తీశాడు. 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోలిన్ మున్రోకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement