రసెల్, నరైన్ కొనసాగింపు.. కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర వీరులు
దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 నాలుగో సీజన్ డిసెంబర్ 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు జరుగనుంది. ఈ సీజన్లో కోసం లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొదటి దశ సెలెక్షన్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఇవాళ (జులై 7) లీగ్ నిర్వహకులు జట్ల వివరాలను వెల్లడించారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 23 మంది ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. ఇందులో ఎనిమిది మందిని రీటైన్ కానీ డైరెక్ట్ సైనింగ్ కానీ చేసుకోవచ్చు. మిగతా బెర్త్‌లను తొలిసారి వేలం ద్వారా భర్తీ చేయనున్నారు.తొలి దశ ఎంపిక ప్రక్రియలో అన్ని ఫ్రాంచైజీలు విధ్వంసకర బ్యాటర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, ఆలీషాన్ షరాఫును రిటైన్ చేసుకొని, కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర బ్యాటర్లను ఎంపిక చేసుకుంది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లైన అలెక్స్ హేల్స్, లియామ్ లివింగ్‌స్టోన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌లను కొత్తగా అక్కున చేర్చుకుంది.మరో ఫ్రాంచైజీ డెజర్ట్ వైపర్స్ డాన్ లారెన్స్, డేవిడ్ పెయిన్, ఖుజైమా బిన్ తన్వీర్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్ హోల్డన్, సామ్ కర్రన్, వనిందు హసరంగను రీటైన్ చేసుకొని, ఆండ్రియస్ గౌస్‌ను కొత్తగా సైన్ చేసుకుంది.దుబాయ్ క్యాపిటల్స్ విషయానికొస్తే.. దసున్ షనక, దుష్మంత చమీరా, గుల్బదిన్ నైబ్, రోవ్‌మన్ పోవెల్, షాయ్ హోప్‌ను రీటైన్ చేసుకొని, కొత్తగా లూక్ వుడ్, వకార్ సలాంఖీల్, ముహమ్మద్ జవాదుల్లాను సైన్ చేసుకుంది.గల్ఫ్ జెయింట్స్ ఆయాన్ అఫ్జల్ ఖాన్, బ్లెస్సింగ్ ముజరబానీ, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, మార్క్ అదైర్‌ను రీటైన్ చేసుకొని.. అజ్మతుల్లా ఒమర్జాయ్, మొయిన్ అలీ, రహ్మానుల్లా గుర్బాజ్‌ను సైన్ చేసుకుంది.ఎంఐ ఎమిరేట్స్ అల్లా ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూకీ, కుసాల్ పెరీరా, రొమారియో షెపర్డ్, టామ్ బాంటన్, ముహమ్మద్ వసీంను రీటైన్ చేసుకొని.. క్రిస్ వోక్స్, కమిందు మెండిస్‌ను సైన్ చేసుకుంది.షార్జా వారియర్జ్ జాన్సన్ ఛార్లెస్, కుసాల్ మెండిస్, టిమ్ సౌధి, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ను రీటైన్ చేసుకొని.. మహీశ్ తీక్షణ, సికందర్ రజా, సౌరభ్ నేత్కావల్కర్, టిమ్ డేవిడ్‌ను సైన్ చేసుకుంది.