దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో విండీస్ వీరుడి రోవ్‌మన్ పావెల్ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆడుతున్న పావెల్.. నిన్న (డిసెంబర్ 7) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్ మెరుపులకు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో పావెల్, కాక్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.టాబీ ఆల్బర్ట్, సెదిఖుల్లా అటల్ తలో 8, షయాన్ జహంగీర్ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అజయ్ కుమార్, పియూశ్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్‌రైడర్స్ తడబడింది. వకార్ సలామ్‌ఖీల్ (3.3-0-29-4), మహ్మద్ నబీ (4-0-12-2), డేవిడ్ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్ (16), రూథర్‌ఫోర్డ్ (19), రసెల్ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.


