breaking news
Jordan Cox
-
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో విండీస్ వీరుడి విధ్వంసం
దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో విండీస్ వీరుడి రోవ్‌మన్ పావెల్ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆడుతున్న పావెల్.. నిన్న (డిసెంబర్ 7) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్ మెరుపులకు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో పావెల్, కాక్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.టాబీ ఆల్బర్ట్, సెదిఖుల్లా అటల్ తలో 8, షయాన్ జహంగీర్ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అజయ్ కుమార్, పియూశ్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్‌రైడర్స్ తడబడింది. వకార్ సలామ్‌ఖీల్ (3.3-0-29-4), మహ్మద్ నబీ (4-0-12-2), డేవిడ్ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్ (16), రూథర్‌ఫోర్డ్ (19), రసెల్ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ఐపీఎల్ వేలంలో ఆ నలుగురికి భారీ ధర!.. అతడిని ముంబై కొనొచ్చు!
ఐపీఎల్ మినీ వేలం-2026 నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి ధర దక్కుతుందని అంచనా వేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్ (The Hundred)లో సత్తా చాటిన ‘ఆ నలుగురు’ అధిక ధరకు అమ్ముడుపోతారంటూ జోస్యం చెప్పాడు.ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడుఅయితే, వాళ్లు ఇంత వరకు ఒక్కసారి కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడకపోవడం విశేషం. ఇంతకీ ఎవరా నలుగురు?!... తన యూట్యూబ్ షో అశ్ కీ బాత్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు ఐపీఎల్లో ఆడని ప్లేయర్..కానీ ఈసారి వేలంలో మాత్రం అధిక ధర పలికే అవకాశం ఉంది. అతడు మరెవరో కాదు జోర్డాన్ కాక్స్ (Jordan Cox).ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ముంబై ఇండియన్స్ అతడపై ఆసక్తి చూపవచ్చు. అతడిని సొంతం చేసుకోవచ్చు కూడా!సోనీ బేకర్ సూపర్ఇక రెండో ఆటగాడు ఎవరంటే.. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో జోష్ టంగ్ మెరుగ్గా ఆడాడు. అయితే, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున అతడు బౌలర్‌గా గొప్పగా రాణించాడు. అదే జట్టు నుంచి మరో ప్లేయర్ కూడా మెరుగ్గా ఆడాడు. అతడే సోనీ బేకర్.అద్భుతమైన ఇన్స్వింగర్లతో ప్రత్యర్థులను భయపెట్టాడు. కొత్త బంతితో మెరుగ్గా రాణించాడు. ఇక రెహాన్ అహ్మద్ .. ఈసారి బౌలింగ్‌తో కన్నా బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచాడు. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చి రాణించాడు. లెగ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించగలడు’’ అని పేర్కొన్నాడు.నలుగురి ప్రదర్శన ఇలాకాగా ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ టంగ్.. పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. 367 పరుగులు సాధించాడు.ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ఆడిన యువ పేసర్ సోనీ బేకర్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్పిన్ ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్.. 189 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే ఐపీఎల్‌కూ కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: ‘భారత క్రికెట్ బాగుండాలంటే.. రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’


