ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్, అబుదాబీ నైట్‌రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో రసెల్ (36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మిగతా ఆటగాళ్లలో ఫిల్ సాల్ట్ 18, అలీషాన్ షరాఫు 25, లివింగ్‌స్టోన్ 4, రూథర్‌ఫోర్డ్ 3, చంద్ 18, నరైన్ 1 (నాటౌట్) పరుగు చేశారు. వైపర్స్ బౌలర్లలో ఖైస్ అహ్మద్, నూర్ అహ్మద్ తలో 2, నసీం షా, డాన్ లారెన్స్ చెరో వికెట్ తీశారు.
అనంతరం ఓ మెస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వైపర్స్ మరో 3 బంతులు మిగిలుండగానే (8 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. షిమ్రోన్ హెట్‌మైర్ (25 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి వైపర్స్‌ను గెలిపించాడు. అతనికి డాన్ లారెన్స్ (35), తన్వీర్ (31 నాటౌట్) సహకరించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో అజయ్ కుమార్ 3, నరైన్ 2, స్టోన్, పియూశ్ చావ్లా, రసెల్ తలో వికెట్ తీశారు.


