టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్‌కు (Venkatesh Prasad) కీలక పదవి దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఈ మాజీ పేసర్ ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన ఎన్నికల్లో ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెల్ దాదాపు అన్ని పదవులను గెలుచుకుంది.
ప్రసాద్ బ్రిజేశ్ పటేల్ మద్దతు పొందిన కేఎన్ శాంత్ కుమార్‌పై 191 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్‌కు 749, శాంత్ కుమార్‌కు 558 ఓట్లు వచ్చాయి. మరో భారత మాజీ క్రికెటర్ సుజిత్ సోమసుందర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వినోద్ శివప్పపై ఆయన 719-588 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కార్యదర్శి హోదాను సంతోష్ మీనన్ తిరిగి దక్కించుకున్నాడు. ఈఎస్ జైరామ్‌పై 675-632 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్ పోస్ట్‌ను బీఎన్ మధుకర్ దక్కించుకున్నాడు. ఎంఎస్ వినయ్‌పై 736-571 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇలా దాదాపుగా ప్రతి పదవిని వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెలే దక్కించుకుంది.
ప్రధాన ఫలితాలు
- అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ – 749 ఓట్లు
- ఉపాధ్యక్షుడు: సుజిత్ సోమసుందర్ – 719 ఓట్లు
- కార్యదర్శి: సంతోష్ మెనన్ – 675 ఓట్లు
- జాయింట్ సెక్రటరీ: బీకే రవి – 669 ఓట్లు
- ఖజాంచి: బీఎన్ మధుకర్ – 736 ఓట్లు
మేనేజింగ్ కమిటీ సభ్యులు
- లైఫ్ మెంబర్స్: వీఎం మంజునాథ్, సైలేష్ పోల, అవినాష్ వైద్య
- ఇన్‌స్టిట్యూషన్ మెంబర్స్: కల్పనా వెంకటాచార్, ఆశిష్ అమర్లాల్
జోన్ ప్రతినిధులు
- మైసూరు – శ్రీనివాస్ ప్రసాద్
- శివమొగ్గ – డీఎస్ అరుణ్
- తుమకూరు – సీఆర్ హరీష్
- ధార్వాడ – వీరాణ సవిడి
- రాయచూర్ – కుశాల్ పటిల్
- మంగళూరు – శేఖర్ శెట్టి
ముఖ్యాంశాలు
- ప్రసాద్ ప్యానెల్ వారి మేనిఫెస్టోలో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లు జరగాలని స్పష్టంగా పేర్కొంది.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ వేడుకలో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పెద్ద మ్యాచ్‌లు జరగలేదు.
- ఈ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిపోవడానికి అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు. డీకే వెంకటేశ్ ప్రసాద్ ప్యానెల్‌కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు.


