వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఎవరీకి సాధ్యం కాని రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 5000 ప్లస్ రన్స్, 500 ప్లస్ వికెట్లు, 500 ప్లస్ సిక్సర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రస్సెల్ రికార్డులెక్కాడు.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో భాగంగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రస్సెస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో రస్సెల్ అబుదాబి నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే లీగ్‌లో 500 టీ20 వికెట్ల మైలు రాయిని కూడా రస్సెల్ అందుకున్నాడు. ఇప్పుడు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సిక్సర్ల ఘనతను అందుకున్నాడు.
ఇక ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రస్సెల్.. ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే రస్సెల్ అనూహ్యంగా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోలేదు.
దీంతో ఈ కరేబియన్ యోదుడు వేలంలోకి వస్తాడని భావించారు. కానీ అంతలోనే రస్సెల్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చాడు. అతడిని కేకేఆర్ యాజమాన్యం పవర్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్-2026లో కేకేఆర్ బ్యాక్‌రూమ్ స్టాప్‌లో రస్సెల్ భాగం కానున్నాడు.
టీ20ల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
రషీద్ ఖాన్ – 500 మ్యాచ్‌లు, 681 వికెట్లు
డ్వేన్ బ్రావో – 582 మ్యాచ్‌లు, 631 వికెట్లు
సునీల్ నరైన్ – 569 మ్యాచ్‌లు, 602 వికెట్లు
ఇమ్రాన్ తాహిర్ – 446 మ్యాచ్‌లు, 570 వికెట్లు
షకీబ్ అల్ హసన్ – 462 మ్యాచ్‌లు, 504 వికెట్లు
ఆండ్రీ రస్సెల్ – 576 మ్యాచ్‌లు, 500 వికెట్లు
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!


