ముంబై ఎమిరేట్స్‌ ఔట్‌.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్ | Gulf Giants WIN by 4 wickets, Set DATE with Desert Vipers in FINALS | Sakshi
Sakshi News home page

ILT20 2023: ముంబై ఎమిరేట్స్‌ ఔట్‌.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్

Feb 11 2023 9:34 AM | Updated on Feb 11 2023 9:42 AM

Gulf Giants WIN by 4 wickets, Set DATE with Desert Vipers in FINALS - Sakshi

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2023 ఫైనల్లో గల్ఫ్ జెయింట్స్ అడుగుపెట్టింది. దుబాయ్‌ వేదికగా క్వాలిఫియర్‌-2లో  ఎంఐ ఎమిరేట్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌ బెర్త్‌ను గల్ఫ్ జెయింట్స్ ఖారారు చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. జెయింట్స్ బ్యాటర్లలో జేమ్స్‌ విన్స్‌ 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

ఎంఐ ఎమిరేట్స్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు, బ్రావో, బౌల్ట్‌ చెరో వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన  ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

ఎమిరేట్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ పొలార్డ్‌ 57 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్‌ మహ్మద్‌ వసీం 31 పరుగులతో రాణించాడు. ఇక ఫిబ్రవరి 12 దుబాయ్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో డిసార్ట్‌ వైపర్స్‌తో జెయింట్స్ తలపడనుంది.
చదవండిT20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. టీమిండియాకు ఊహించని షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement