తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! | Dhruv Jurel Comments-After Break-7-Innings-Drought-Fifty-SL-1st Test | Sakshi
Sakshi News home page

తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే!

Aug 17 2026 11:41 AM | Updated on Aug 17 2026 12:04 PM

Dhruv Jurel Comments-After Break-7-Innings-Drought-Fifty-SL-1st Test

Photo Credit: BCCI Twitter

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ అర్ధ‌శ‌త‌కంతో మెరిశాడు. అయితే గ‌త ఏడు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ బ్యాట్ నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో లంక‌తో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు అవ‌కాశమివ్వాల‌ని డిమాండ్లు కూడా వ‌చ్చాయి. 

కానీ జ‌ట్టు మేనేజ్‌మెంట్ మాత్రం జురెల్‌పై న‌మ్మ‌కాన్ని ఉంచింది. అందుకే జురెల్‌ హాఫ్‌ సెంచరీ చేయగానే కోచ్‌ గంభీర్‌తో పాటు చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌ చప్పట్లు కొడుతూ అభినందించడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా జురెల్ లంకతో తొలి టెస్టులో  ఫిఫ్టీ మార్క్ సాధించి జ‌ట్టుతో పాటు కెప్టెన్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు.  అయితే రెండో రోజు ఆట ముగిసిన త‌ర్వాత  జురెల్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌పై స్పందించాడు. 

‘‘నిజాయితీగా చెప్పాలంటే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించడమే గొప్ప విష‌యంగా భావిస్తున్నా. నా ఆట విష‌యంలో అటు కోచ్‌.. ఇటు కెప్టెన్ అన్ని వేళ‌లా మ‌ద్ద‌తుగా నిలిచారు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా బ్యాటింగ్ ఆడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. వాళ్లు చెప్పిన‌ట్లే ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా ఆడి ఇవాళ అర్ధ‌శ‌త‌కంతో మెరిశాను. 

నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతృప్తిగా ఉన్నా. జ‌ట్టుకు ఏం కావాలో అది చేయ‌డ‌మే నా ప‌ని. ఇండియా-ఏ త‌ర‌ఫున మ్యాచ్ ఆడేందుకు ప‌ది రోజుల‌ ముందే శ్రీలంక‌లో అడుగుపెట్టాము. కొలంబోలో ప్రాక్టీస్ చేయ‌డం స‌హా గాలేలోనూ మ్యాచ్ ఆడాము. దీంతో రెండు వేదిక‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చింది, అది ఇవాళ బ్యాటింగ్‌లో రాణించేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంది. అంతేకాదు ఇక్క‌డి వాతావ‌ర‌ణం, ప‌రిస్థితులు అర్థం చేసుకునేందుకు కూడా ఎంతో దోహ‌ద‌ప‌డింది’’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: భార‌త్ 462 ఆలౌట్‌.. అరంగేట్రంలోనే లంక బౌల‌ర్‌ చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement