భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా శ్రీలంక-ఎతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సోనాల్ దినుషాను నియమించారు.
ఈ జట్టులో రమేష్ మెండిస్, లహిరు కుమార వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న నిషాన్ మదుష్క, పసిందు సూరియబండార వంటి యువ ఆటగాళ్లను లంక సెలక్టర్లు 'ఎ' జట్టుకు ఎంపిక చేశారు.
కాగా శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే శ్రీలంక గడ్డపై అడుగు పెట్టింది. అయితే ఈ టూర్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్దానంలో జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.
భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లంక-ఎ జట్టు
నిషాన్ మదుష్క, రవిందు రశాంత, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా(కెప్టెన్), అంజల బండార(వికెట్ కీపర్), నిపున్ దనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంక మనోజ్, ఇసిత విజేసుందర, దిలుమ్ రమేష్ మెండిస్
చదవండి: DPL 2026: పప్పూ యాదవ్ తనయుడి విధ్వంసం.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో


