తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్‌కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా నిలిచాడు.
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్‌లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.
అదే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్‌లను కూడా అధిగమించాడు.
టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్‌ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.
ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్‌మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు.


