SL Vs IND 1st Test Day-5 Updates: శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభమైంది.
డిసిల్వా ఫిఫ్టీ
లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. దినూష (43) పరుగులతో ఆడుతున్నాడు. లంక విజయానికి మరో 241 పరుగులు అవసరం.
వంద పరుగుల మార్క్ దాటిన లంక
372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వంద పరుగుల మార్క్‌ను దాటింది. 43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ధనంజయ (40), దినూష (33) క్రీజులో ఉన్నారు.
ఐదోరోజు ఆట మొదలు
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఐదో రోజు ఆట ప్రారంభం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం. 372 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్లా 39 పరుగులు, సోనాల్ దినూష 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.


