Photo Credit: Twitter
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్‌లో భయానక సంఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆశిష్ మీనా వేసిన 18వ ఓవర్‌లో బ్యాటర్ లక్ష్య థరేజా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ నేరుగా అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ ముఖాన్ని బలంగా తాకింది. దీంతో అంపైర్ నొప్పితో విలవిల్లాడిపోయారు.
అదే సమయంలో తాను కొట్టిన బంతి అంపైర్‌కు బలంగా తాకడంతో లక్ష్య థరేజా బాధను వ్యక్తం చేశాడు. అయితే తాజా నివేదిక ప్రకారం అంపైర్ భరద్వాజ్ పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే మ్యాచ్లో అంతకముందే అంపైర్ భుజం గాయానికి గురయ్యారు.
మ్యాచ్ విషయానికొస్తే ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో న్యూఢిల్లీ టైగర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మయాంక్ రావత్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా, వాన్స్ మెహ్రా (35), అర్పిత్ రానా (33) రాణించారు. న్యూఢిల్లీ టైగర్స్ బౌలర్లలో రిషబ్ శర్మ 3 వికెట్లు తీయగా, లక్ష్మణ్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో న్యూఢిల్లీ టైగర్స్ 19.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (31), లక్ష్య థరేజా (21) పర్వాలేదనిపించారు. ఈస్ట్ ఢిల్లీ బౌలర్లలో ఆశిశ్ మీనా, మయాంక్ యాదవ్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.
చదవండి: జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!


