జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్‌.. కానీ ఒక కండిషన్‌! | Warner Punished-Drink-Driving Case-Not-Jail-Must-Use-Ignition Lock | Sakshi
Sakshi News home page

జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్‌.. కానీ ఒక కండిషన్‌!

Aug 18 2026 12:40 PM | Updated on Aug 18 2026 12:49 PM

Warner Punished-Drink-Driving Case-Not-Jail-Must-Use-Ignition Lock

Photo Credit: Twitter

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విష‌యంలో సిడ్నీ కోర్టు మంగ‌ళ‌వారం త‌న‌ తీర్పును వెల్ల‌డించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దోషిగా తేలిన వార్న‌ర్‌కు 1500 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు ల‌క్ష రూపాయ‌లు) భారీ జ‌రిమానా విధించింది. దీంతో పాటు అతను రాబోయే 12 నెలల్లో డ్రైవింగ్‌ చేయాలనుకుంటే ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ ఉపయోగించాలనే కండిషన్‌ను పెట్టింది.

ఏమిటీ ఇగ్నిష‌న్ ఇంట‌ర్‌లాక్‌?
ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ పరికరం అనేది వాహనం ఇగ్నిషన్ సిస్టమ్‌కు అనుసంధానించబడిన ఒక చిన్న శ్వాస పరీక్షా యంత్రం. డ్రైవర్ బ్రీత్ టెస్టులో మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకున్న‌ట్లు తేలితే, కారు స్టార్ట్ అవ్వకుండా ఇగ్నిష‌న్ ప‌రిక‌రం అడ్డుకుంటుంది. వార్న‌ర్ ఎప్పుడైనా వాహనం నడపడానికి ముందుకు వ‌చ్చినా, మొద‌ట‌ వార్నర్ ఇగ్నిష‌న్ ఇంట‌ర్‌లాక్‌ పరికరం ద్వారా శ్వాస నమూనాను అందించాల్సి ఉంటుంది. రీడింగ్ అనుమతించబడిన పరిధిలో ఉంటేనే అత‌డు ఇంజిన్‌ను స్టార్ట్ చేయ‌డానికి వీలు ఉంటుంది.

అస‌లేం జ‌రిగింది?
గ‌త ఏప్రిల్‌లో ఈస్టర్‌ సండే రోజున సిడ్నీలోని మ‌రౌబాలో వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్‌కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. వార్నర్‌పై అనుమానంతో పోలీసులు అత‌నికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్న‌ర్‌ను అదుపులోకి తీసుకొని ద‌గ్గ‌ర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఆ త‌ర్వాత బెయిల్‌పై విడుద‌లైన వార్న‌ర్ త‌ర‌ఫున అతడి న్యాయ‌వాది బాబీ హిల్ జూలై 27న సిడ్నీ కోర్టులో హాజ‌ర‌య్యాడు. వార్న‌ర్ ‘మిడ్ రేంజ్‌’లో డ్రింక్ చేశాడ‌ని కోర్టుకు వివ‌రించాడు. అనంత‌రం వార్న‌ర్ త‌న నేరాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు కూడా అత‌ని త‌ర‌ఫు లాయ‌ర్ కోర్ట‌కు తెలిపాడు.  ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలిన వార్న‌ర్‌కు 9 నెల‌ల జైలుశిక్ష కూడా ప‌డుతుంద‌ని అంతా భావించారు. కానీ వార్న‌ర్ త‌న త‌ప్పును కోర్టు ఎదుట అంగీక‌రించ‌డంతోనే మొద‌టి త‌ప్పు కింద‌ జైలు శిక్ష వేయడం లేద‌ని, జ‌రిమానాతో స‌రిపెడుతున్న‌ట్లు  సిడ్నీ కోర్టు తెలిపింది.

Read: నేరాన్ని అంగీక‌రించిన వార్న‌ర్‌.. ఆగ‌స్టు 18న తుది తీర్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement