breaking news
ignition
-
జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలో సిడ్నీ కోర్టు మంగళవారం తన తీర్పును వెల్లడించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దోషిగా తేలిన వార్నర్‌కు 1500 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు లక్ష రూపాయలు) భారీ జరిమానా విధించింది. దీంతో పాటు అతను రాబోయే 12 నెలల్లో డ్రైవింగ్ చేయాలనుకుంటే ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ ఉపయోగించాలనే కండిషన్‌ను పెట్టింది.ఏమిటీ ఇగ్నిషన్ ఇంటర్‌లాక్?ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ పరికరం అనేది వాహనం ఇగ్నిషన్ సిస్టమ్‌కు అనుసంధానించబడిన ఒక చిన్న శ్వాస పరీక్షా యంత్రం. డ్రైవర్ బ్రీత్ టెస్టులో మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలితే, కారు స్టార్ట్ అవ్వకుండా ఇగ్నిషన్ పరికరం అడ్డుకుంటుంది. వార్నర్ ఎప్పుడైనా వాహనం నడపడానికి ముందుకు వచ్చినా, మొదట వార్నర్ ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ పరికరం ద్వారా శ్వాస నమూనాను అందించాల్సి ఉంటుంది. రీడింగ్ అనుమతించబడిన పరిధిలో ఉంటేనే అతడు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి వీలు ఉంటుంది.అసలేం జరిగింది?గత ఏప్రిల్‌లో ఈస్టర్ సండే రోజున సిడ్నీలోని మరౌబాలో వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్‌కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. వార్నర్‌పై అనుమానంతో పోలీసులు అతనికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్నర్‌ను అదుపులోకి తీసుకొని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన వార్నర్ తరఫున అతడి న్యాయవాది బాబీ హిల్ జూలై 27న సిడ్నీ కోర్టులో హాజరయ్యాడు. వార్నర్ ‘మిడ్ రేంజ్’లో డ్రింక్ చేశాడని కోర్టుకు వివరించాడు. అనంతరం వార్నర్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అతని తరఫు లాయర్ కోర్టకు తెలిపాడు. ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలిన వార్నర్‌కు 9 నెలల జైలుశిక్ష కూడా పడుతుందని అంతా భావించారు. కానీ వార్నర్ తన తప్పును కోర్టు ఎదుట అంగీకరించడంతోనే మొదటి తప్పు కింద జైలు శిక్ష వేయడం లేదని, జరిమానాతో సరిపెడుతున్నట్లు సిడ్నీ కోర్టు తెలిపింది.Read: నేరాన్ని అంగీకరించిన వార్నర్.. ఆగస్టు 18న తుది తీర్పు! -
గూడ్స్ రైలులో మంటలు
బొగ్గుతో వెళ్తుండగా ప్రమాదం యలమంచిలి స్టేషన్లో గుర్తించిన గార్డు మూడు గంటలు శ్రమించి అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది యలమంచిలి, న్యూస్‌లైన్: బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు రేగడంతో సిబ్బంది సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించారు. యలమంచిలి రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గూడ్స్ రైలులో మొదటిబోగీ నుంచి మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుంచి కొండపల్లి బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు సిగ్నల్ లేకపోవడంతో యలమంచిలి రైల్వేస్టేషన్ లో నిలిపారు. ఆ సమయంలో బోగీనుంచి పొగలు వస్తున్నట్టు గార్డు ఏ.ఆడమ్ గుర్తించారు. వెంటనే స్టేషన్ సూపరింటెండెంట్‌కు తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న యలమంచిలి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి రైలు బోగీలో మంటలను అదుపు చేశారు. సుమారు 3 గంటలపాటు మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది గునపాలతో బొగ్గును పైకి తీస్తూ పెద్దయెత్తున నీటిని వినియోగించారు. రైలు ప్రయాణంలో బొగ్గు రాపిడి వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని రైల్వేశాఖ సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదు.


