ఢిల్లీ: జ్యూరిక్ విమానాశ్రయంలో ఢిల్లీకి విమానం బయలుదేరే ముందు నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షలో ఫెయిలైన ఎయిర్ ఇండియా సహ పైలట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 6న జరిగిన ఈ ఘటన జరిగింది. జ్యూరిక్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానానికి చెందిన కో-పైలట్ మద్యం సేవించినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక పరీక్షలో అతను ఫెయిల్ కాగా, రెండో పరీక్ష ఫలితం ఇంకా రావాల్సి ఉంది.
తర్వాత అతడిని ప్రయాణికుడిగా భారత్‌కు తిరిగి పంపించారు. తుది వైద్య పరీక్ష నివేదిక వచ్చే వరకు అతను సస్పెన్షన్‌లోనే ఉంటాడని అధికారులు తెలిపారు. భద్రత, నియంత్రణ నిబంధనలు, సంస్థ ప్రోటోకాల్స్‌కు సంబంధించిన ఏ ఉల్లంఘననైనా తీవ్రంగా పరిగణిస్తామన్న ఎయిరిండియా.. ఉల్లంఘన నిర్థారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఎయిర్ ఇండియా తన పైలట్లందరికీ కొత్తగా తప్పనిసరి డ్రగ్ (డోప్) పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. మరో ఘటనలో ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలోని పైలట్‌కు కూడా డ్రగ్ పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: వినీత్ మనోచా హత్య కేసులో బిగ్ ట్విస్ట్!


