విద్యార్థులకు దేశీయంగా విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం దేశీ ప్రయాణాలకు సంబంధించి 10 శాతం రాయితీ అందిస్తోంది. అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
సాధారణంగా అమల్లో ఉండే 15 కేజీల చెక్ ఇన్ బ్యాగేజీకి అదనంగా మరో 10 కేజీల బ్యాగేజీ సదుపాయం, కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి కేవలం రూ. 99కే ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం లభిస్తుంది. 12 ఏళ్లు పైబడి, చెల్లుబాటయ్యే స్టూడెంట్ ఐడీ కలిగి ఉన్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. విద్యార్థులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్‌లోని Student Fare విభాగాన్ని సందర్శించి ఆఫర్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..


