న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన కీలక కార్యక్రమాలు రద్దు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేష్‌కుమార్ తన పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫౌండర్ అభిజిత్ ఖేర్కే అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలోనే జెన్‌జీ యువతతో కలిసి జ్ఞానేష్ కుమార్ నిర్వహించాల్సిన రెండు ముఖ్యమైన ఓటరు అవగాహన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారనే చర్చ నడుస్తోంది.
వాస్తవానికి ఇందులో మొదటి ఈవెంట్ మీరట్‌లో ఈరోజు జరగాల్సి ఉండగా, సెప్టెంబర్ 29న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండో ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ, ఈలోపే ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాలను వాయిదా వేసింది.
ఎన్నికల సంఘం స్పష్టత:
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పాల్గొనాల్సిన ఈ యువజన ఓటరు అవగాహన కార్యక్రమాల వాయిదాపై వస్తున్న ఊహాగానాలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న వివిధ వివాదాలు లేదా చర్చల కారణంగానే ఈ కార్యక్రమాలు రద్దు అయ్యాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది.
కేవలం వేదికలు, షెడ్యూలింగ్ సమస్యల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. త్వరలోనే వీటికి సంబంధించిన కొత్త తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


