‘ఈసీఐ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి’ | rahul gandhi demand Gyanesh Kumar resignation | Sakshi
Sakshi News home page

‘ఈసీఐ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి’

Sep 24 2026 7:21 PM | Updated on Sep 24 2026 7:41 PM

rahul gandhi demand Gyanesh Kumar resignation

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశాయి. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఓట్ల చోరి జరిగిందనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని నేతలు ప్రశ్నించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. దేశంలో వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధించడం వెనుక ఎన్నికల సంఘం అండదండలు ఉన్నాయని, ఓట్ల చోరి కోసమే జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరి అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, వీరిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

దేశంలో మోదీ, అమిత్ షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాజ్యాంగ విలువులను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

దేశంలో చాలా మంది ప్రధానిలు ప్రజల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, మోదీ మాత్రం ప్రతి ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారంటూ పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం,ఎన్నికల సంఘం తీరుపై ధ్వజమెత్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement