సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ‘అభిశంసన’ అస్త్రం! | Opposition To Push For Impeachment Of Poll Body Chief Again | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ‘అభిశంసన’ అస్త్రం!

Sep 24 2026 5:05 PM | Updated on Sep 24 2026 5:18 PM

Opposition To Push For Impeachment Of Poll Body Chief Again

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో మొత్తం 14 సార్లు అభ్యంతరాలను ఎన్నికల కమిషనర్లు సందు, వివేక్ జోషి నమోదు చేశారు. ఫామ్-6లో జరిగిన మార్పులను వారు వ్యతిరేకించారు. మెజారిటీ లేని నిర్ణయాలు చట్ట విరుద్ధమని విపక్ష పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలంట విపక్షా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌జోషీలు మొత్తం 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారని, అనధికారిక, అక్రమ ఉత్తర్వులంటూ తెలిపినప్పటికీ ఆ నిర్ణయాలు అమలయ్యాయని ఈ కథనం ఆరోపించింది.

దీంతో సర్‌తోపాటు ఎన్నికల కమిషన్‌ తీరుతెన్నులపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మరోసారి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుండగా.. శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీపార్టీ, సీపీఐ(ఎం), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, పీడీపీలు కూడా గొంతుకలిపాయి.

ఇదీ చదవండి: 48 గంటల్లో రాజీనామా చేయకపోతే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement