‘ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది బాబుకు తెలుసు’ | YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది బాబుకు తెలుసు’

Sep 24 2026 4:52 PM | Updated on Sep 24 2026 7:13 PM

YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu

తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ నిజస్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా కార్యకర్తలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ సూచించినట్లు కురసాల పేర్కొన్నారు. దీనిలో భాగంగా బలమైన అభ్యర్థుల ఎంపికను ప్రారంభించాలని వైఎస్‌ జగన్‌ చెప్పారరన్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు 24 గంటుల అందుబాటులో ఉంటానని వైఎస్‌ జగన్‌ తమకు హామీ ఇచ్చారన్నారు.

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మీడియాతో కురసాల మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారు. వెన్నుపోటు పార్టీ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు.. పోలీసులను, అధికారులను అస్త్రంగా వాడే అవకాశం ఉంది. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా అధికారులు చూడాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత బాబు బెదిరించే అవకాశం కూడా ఉంది. 

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది బాబుకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తన టక్కుటమారా విద్యలు ప్రయోగిస్తారు. హోంమంత్రి హోంమంత్రిగా కంటే కూడా టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు.  జగన్‌ నామస్మరణ చేయకుండా కూటమి నేతలకు పూట గడవడం లేదు. సాయికృష్ణ లాకప్‌డెత్‌మీద ఎంత మేకప్‌ వేద్దామనుకున్నా కూటమికి కుదరలేదు. బూడిదైనా ఇప్పించండని సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు మాట్లాడితే హోంమంత్రి ఎందుకు మాట్లాడరు. హోంమంత్రి తీరు అబద్ధాలను ప్రచారం చేసేలా ఉంది. సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో డీజీపీ నిద్ర పోతున్నారా అని కోర్టు అడిగిన విషయం గుర్తు లేదా? అని కురసాల ప్రశ్నించారు.

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement