వైఎస్‌ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు | Senior CPI leaders Meet YSRCP Chief YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు

Sep 24 2026 3:36 PM | Updated on Sep 24 2026 5:12 PM

Senior CPI leaders Meet YSRCP Chief YS Jagan

తాడేపల్లి:   మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రముఖ సీపీఐ నేతలు కలిశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్‌ 24వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో సీపీఐ ప్రముఖ నేతలు సమావేశమయ్యారు.  వీరికి వైఎస్‌ జగన్‌ సాదర స్వాగతం పలికారు. 

 

వైఎస్‌ జగన్‌తో సమావేశమైన వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డిలు ఉన్నారు.

ప్రజా సంబంధిత అంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీసీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వైఎస్సార్‌సీపీని ఆహ్వానించారు.  ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య.. వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం అందించారు.

సమావేశం అనంతరం ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీన రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశామని, దానికి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించినట్లు ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ప్రజా పోరాటాలకు వైఎస్‌ జగన్‌ సుముఖత వ్యక్తం చేశారని, ఎస్‌ఎల్‌ఆర్‌ గురించి సైతం ఆయన మద్దతు కోరినట్లు పేర్కొన్నారు. 

ఎస్‌ఐఆర్‌ పేరుతో భారీగా ఓట్లు తొలగించారన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, సమాధానం చెప్పలేక దాడులు చేయడం సరికాదన్నారు ఈశ్వరయ్య.

వైఎస్ జగన్ను కలిసాక CPI ఈశ్వరయ్య రియాక్షన్

ఇదీ చదవండి: బాబు కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement