సీపీ సజ్జనార్‌కు పాడి కౌశిక్‌ రెడ్డి వార్నింగ్‌ | BRS MLA Padi Kaushik Reddy Issues Warning to Hyderabad CP Sajjanar | Sakshi
Sakshi News home page

సీపీ సజ్జనార్‌కు పాడి కౌశిక్‌ రెడ్డి వార్నింగ్‌

Sep 24 2026 3:35 PM | Updated on Sep 24 2026 4:23 PM

BRS MLA Padi Kaushik Reddy Issues Warning to Hyderabad CP Sajjanar

సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వినాయక విగ్రహం నిమజ్జన వేడుకల సందర్భంగా సీపీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

నిమజ్జన వేడుకల్లో యువత మాజీ సీఎం కేసీఆర్ పాటలు పెట్టుకుంటుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పాటలు పెట్టుకుంటే యువతపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ని ఉద్దేశిస్తూ.. సజ్జనార్‌ తెలంగాణ నీ జాగీరా?. రెండేళ్లలో రిటైర్‌ అవుతున్నానని అనుకుంటున్నారేమో.. మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. సప్త సముద్రాల అవుతల ఉన్నా పట్టుకొస్తామని’ హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement