జ‌డేజా ఖాతాలో ఊహ‌కు కూడా అందని చెత్త రికార్డు! | Ravindra Jadeja Worst Record-Most No-Balls-Spinners-Tests-Since-2021 | Sakshi
Sakshi News home page

జ‌డేజా ఖాతాలో ఊహ‌కు కూడా అందని చెత్త రికార్డు!

Aug 26 2026 9:25 PM | Updated on Aug 26 2026 9:31 PM

Ravindra Jadeja Worst Record-Most No-Balls-Spinners-Tests-Since-2021

Photo Credit: BCCI Twitter

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్టుల్లో ఊహ‌కు అంద‌ని విధంగా అత్యంత చెత్త రికార్డును న‌మోదు చేశాడు. డీఆర్ఎస్ కోర‌డంలో 22 సార్లు విఫ‌ల‌మై చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్న జ‌డేజా ఖాతాలో ఇప్పుడు నోబాల్స్ రికార్డు కూడా వ‌చ్చి చేర‌డం గ‌మ‌నార్హం. 2021 నుంచి ఐదేళ్ల కాలంలో జ‌డేజా అత్య‌ధిక నోబాల్స్ వేసిన స్పిన్న‌ర్‌గా నిలిచాడు. 

అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. ఫాస్ట్ బౌల‌ర్లు నోబాల్స్ వేయ‌డం స‌ర్వ సాధార‌ణం. ఎందుకంటే ర‌న‌ప్‌లో తేడా వ‌చ్చిన ప్ర‌తీసారి వాళ్లు నోబాల్స్ వేయ‌డం క‌నిపిస్తుంది. కానీ స్పిన్న‌ర్లు మాత్రం వీలైనంత త‌క్కువ‌గానే నోబాల్స్ వేయ‌డం చూస్తుంటాం.

కానీ జ‌డేజా విష‌యంలో మాత్రం సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. 2021 నుంచి ఇప్పటివరకు జడేజా 88 నో బాల్స్ వేయడం గణాంకాల పరంగా ఆందోళన కలిగించే అంశం. తాజాగా కొలంబో వేదికగా జ‌రుగుతున్న రెండో టెస్టులో జడేజా నో-బాల్ వేయడం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అంతేకాదు ఇదే టెస్టులో భారత స్పిన్నర్లు ఇప్పటివరకు మొత్తం 10 నో-బాల్స్ వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

నో-బాల్స్ జాబితాలో జడేజా టాప్
2021 నుంచి టెస్టు క్రికెట్ లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్ గణాంకాలను పరిశీలిస్తే జడేజా అందరికంటే ముందున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ 40 నోబాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా వేసిన నో-బాల్స్ సంఖ్య త‌న త‌ర్వాతి  స్థానంలో ఉన్న బౌల‌ర్‌కు రెట్టింపు సంఖ్య‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

2021 నుంచి టెస్టుల్లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్:
👉రవీంద్ర జడేజా (భారత్): 88
👉నోమన్ అలీ (పాకిస్థాన్): 40
👉లసిత్ ఎంబల్దేనియా (శ్రీలంక): 33
👉జాక్ లీచ్ (ఇంగ్లాండ్): 19
👉జోమెల్ వార్రికాన్ (వెస్టిండీస్): 17
👉జహిర్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్): 17

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే కొలంబోలో శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేస‌రికి భార‌త్ ప‌టిష్ట‌మైన స్థితిలో నిలిచింది. వ‌ర్షంతో మ్యాచ్ ఆగిపోయే స‌మ‌యానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండ‌గా, ఆతిథ్య జ‌ట్టు కేవ‌లం 16 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యంలో కొన‌సాగుతోంది. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ ​కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది.

Read: 21 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement