కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. తొలి రోజు ఆటముగిసే సమయానికి లంక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆతిథ్య జట్టు వికెట్లు పడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాన్ మధుష్క(66), రవిందు రసంత(71) అద్భుతమైన ఆరంభాన్ని వచ్చారు.
వారిద్దరూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్య నెలకొల్పి ఇండియన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే సమన్వయ లోపం కారణంగా మధుష్క రనౌట్ కావడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. నిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా రాణించాడు.
అయితే రసంత, సూరియబండారా(35)లను వరుస ఓవర్లలో ఔట్ చేసి భారత్ కాస్త కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన పవన్ రాత్నాయకే(39), అహన్ విక్రమసింఘే(31), కెప్టెన్ సోనల్ దినుష(52), రమేష్ మెండిస్(32) నిలకడగా ఆడి జట్టు స్కోర్ 350 పరుగుల మార్క్‌ను దాటించారు.
ప్రస్తుతం క్రీజులో కేశర నువాంత(9), సుదీరా(1) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు గుర్నూర్ బ్రార్‌ఘ ఓ వికెట్ తీశాడు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 13 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.


