breaking news
Ireland Vs Afghanistan
-
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు సార్లు ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7.4 ఓవర్లలో 34 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఈ రికార్డు సృష్టించాడు.రషీద్ 2017లో తొలిసారి ఆరు వికెట్ల ప్రదర్శన (ఐర్లాండ్‌పైనే) నమోదు చేశాడు. అదే ఏడాది విండీస్‌పై 7-18 ప్రదర్శన నమోదు చేసి రెండోసారి ఈ ఘనత సాధించాడు. తాజాగా ఐర్లాండ్‌పై మరోసారి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి, వన్డే క్రికెట్లో మూడోసారి ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక సార్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ పేరిట ఉంది. వకార్ ఏకంగా ఐదుసార్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్నిన్ విభాగంలో రషీద్ తర్వాతి స్థానంలో వనిందు హసరంగ (2) ఉన్నాడు. పేస్ విభాగంలో వకార్ తర్వాతి స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (2) ఉన్నాడు. భారత్ తరఫున ఆశిష్ నెహ్రా వన్డేల్లో రెండుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. రషీద్ ఖాన్ వన్డేల్లో ఇప్పటివరకు ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. టెస్ట్‌ల్లో ఐదు సార్లు, టీ20ల్లో రెండు సార్లు ఈ ఘనత సాధించాడు.ఇదిలా ఉంటే, రషీద్ స్పిన్న్ మాయాజాలం దెబ్బకు రెండో వన్డే ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 33.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను తలో 47 ఓవర్లకు కుదించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో వన్డే బెల్ఫాస్ట్ వేదికగా ఆగస్ట్ 10న జరుగనుంది. -
విండీస్‌కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అఫ్గాన్ క్వాలిఫై
బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ గెలుపొందింది. దీంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027కు అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచే జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీకి డైరక్ట్‌గా క్వాలిఫై అవుతాయి.అఫ్గాన్ ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్ధానంలో ఉంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు క్వాలిఫై కావాలంటే అఫ్గాన్‌కు ఐర్లాండ్ సిరీస్‌లో ఒక్క విజయం అవసరముండేది. ఇప్పుడు రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ సాధించడంతో అఫ్గాన్ ప్రపంచకప్ బెర్త్ అధికారికంగా ఖారరైంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అఫ్గాన్ నేరుగా అర్హత సాధించడం ఇదే కేవలం రెండోసారి మాత్రమే.ఐర్లాండ్, విండీస్‌కు బిగ్ షాక్కాగా అఫ్గాన్ గెలుపుతో ఐర్లాండ్, వెస్టిండీస్‌లకు భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్ నేరుగా క్వాలిఫై కావాలంటే అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉండగా.. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం, రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.మరోవైపు అఫ్గాన్‌పై ఐర్లాండ్ గెలిస్తే.. భారత్‌తో సిరీస్‌లో ఒక్క విజయం సాధించి వరల్డ్‌కప్ టోర్నీకి నేరుగా క్వాలిఫై కావాలనుకున్న విండీస్ ఆశలు కూడా ఆడియాశలయ్యాయి. వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో పదివ స్ధానంలో ఉంది.చివరగా జరిగిన 2023 వరల్డ్ కప్‌లో కూడా కరేబియన్ జట్టు భాగం కాలేదు. అప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలవలేక ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ ఆడింది. సూపర్-6 దశలో స్కాట్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసి తొలిసారి వన్డే ప్రపంచకప్‌నకు దూరమైంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి' -
6 వికెట్లతో చెలరేగిన రషీద్.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్
బ్రిడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి అఫ్గాన్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 47 ఓవర్లకు 47 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (84) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు సెదికుల్లా అటాల్(45)తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఆ తర్వాత కెప్టెన్ రహమత్ షా(30), ఆజ్మతుల్లా ఒమర్జాయ్(33), హష్మతుల్లా షాహిదీ (36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐరీష్ బౌలర్లలో జై ముంద్రా, మార్క్ అడైర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు గావిన్, క్యాంఫ్హార్, హ్యారీ టెక్టర్ చెరో వికెట్ తీశారు.రషీద్ స్పిన్ మ్యాజిక్‌అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఐరీష్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఐర్లాండ్ పవర్‌ప్లేలో 65/1తో నిలిచినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. రషీద్ దెబ్బకు ఆతిథ్య జట్టు టాపార్డర్ కుప్పకూలింది. మొత్తంగా రషీద్ ఖాన్ 7.4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా ఐర్లాండ్ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది. కాగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో అఫ్గానిస్తాన్ గెలిస్తే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే సిరీస్ సమమవుతోంది. -
‘అఫ్గనిస్తాన్‌తో సిరీస్ బాయ్‌కాట్ చేయొచ్చు’
క్రికెట్ ఐర్లాండ్ ఇటీవలే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.కాగా గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు అఫ్గనిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్‌లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్ అఫ్గన్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఆడింది. ఇక ఐర్లాండ్ తాజాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్‌తో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. క్రికెట్ ఐర్లాండ్ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్ అఫ్గనిస్తాన్‌తో సిరీస్ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్‌కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైంది. కనీసం సూపర్-8 దశ చేరకుండానే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్ పదవికి పాల్ స్టిర్లిండ్ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బ్రీడీ, బెల్ఫాస్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


