సీఎస్‌కే కోచ్‌గా వరల్డ్ కప్ విన్నర్..? అశ్విన్ కీలక వ్యాఖ్యలు | World Cup Winning Captain To Take Over As CSK Head Coach, Ashwin Drops Major Hint | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే కోచ్‌గా వరల్డ్ కప్ విన్నర్..? అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Aug 13 2026 10:18 AM | Updated on Aug 13 2026 10:36 AM

World Cup Winning Captain To Take Over As CSK Head Coach, Ashwin Drops Major Hint

source: X

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో ఇటీవలే విడిపోయిన సీఎస్‌కే.. కొత్త కోచ్ కోసం అన్వేషణ సాగిస్తున్న వేళ మాజీ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ విజేత, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సీఎస్‌కే కోచ్ రేసులో బలమైన అభ్యర్థి కావచ్చని వెల్లడించాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అశ్విన్.. మోర్గాన్ పేరు బలంగా వినిపిస్తోందని, ఇప్పటికే ఈ విషయంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు తనకు సమాచారం ఉందని చెప్పాడు. అయితే మోర్గాన్ ఈ ఏడాదే బాధ్యతలు స్వీకరిస్తాడా? లేక మరొకరు ముందుగా జట్టును నిర్మించి, ఆ తర్వాత మోర్గాన్ బాధ్యతలు తీసుకుంటాడా? అనే రెండు అవకాశాలు ఉన్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

మోర్గాన్‌కు అత్యున్నత స్థాయిలో కోచింగ్ అనుభవం లేకపోయినా.. వ్యూహ రచనలో అతడికి మంచి పేరుంది. ఇంగ్లండ్ వన్డే క్రికెట్‌ను కొత్త దిశలో నడిపించడంలో అతడి నాయకత్వం కీలకంగా నిలిచింది. 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఐపీఎల్‌ ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు.

మరోవైపు సీఎస్‌కే కోచ్ రేసులో బ్రెండన్ మెకల్లమ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లతో అతడికి ఉన్న బాధ్యతల కారణంగా ఐపీఎల్‌లో పూర్తి స్థాయిలో పనిచేయడం అంత సులభం కాదని అశ్విన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో మెకల్లమ్‌ను సీఎస్‌కే తీసుకురావడం కష్టమయ్యే పని అని అభిప్రాయపడ్డాడు.

ధోనీనే మరో ఏడాది నడిపిస్తాడా..?
అయితే అశ్విన్ చేసిన మరో వ్యాఖ్య కూడా సీఎస్‌కే అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ధోని మరో ఏడాది జట్టును నడిపించే అవకాశం కూడా ఉందని అతడు పేర్కొన్నాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్‌కేకు కొత్త కోచ్ నియామకం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ఆటగాళ్ల ట్రేడింగ్, జట్టు నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే కొత్త కోచ్‌ను నియమించకుండా ధోని నాయకత్వంలో మరో ఏడాది జట్టును నడిపించడం సరైన మార్గమని అభిప్రాయపడ్డాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement