source: X
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తొలి సెషన్ ముగిసే సమయానికి 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్‌పై అనుకూల పరిస్థితులను బంగ్లాదేశ్ పేసర్లు సమర్థంగా వినియోంచుకున్నారు.
ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించిన జేక్ వెదరాల్డ్ (23)ను జట్టు స్కోర్ 45 పరుగుల వద్ద ఉండగా హసన్ మహదుద్ బోల్తా కొట్టించాడు. అదే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు లభించిన తొలి సక్సెస్. ఆమరుసటి ఓవర్‌లోనే హసన్ మరోసారి చెలరేగాడు. జట్టు స్కోర్ 52 పరుగుల వద్ద ఉండగా.. ట్రవిస్ హెడ్‌ను (22) క్లీన్ బౌల్డ్ చేశాడు.
కొద్ది సేపటికి మరో పేసర్ ఎబాదత్ హొసేన్ చెలరేగాడు. 61 పరుగుల జట్టు స్కోర్ వద్ద అప్పటికే క్రీజ్‌లో ఇబ్బందిపడుతున్న లబూషేన్‌ను (1) ఔట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే తస్కిన్ అహ్మద్ కెమరూన్ గ్రీన్‌ను (13) బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్ లంచ్ విరామం సమయానికే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే ఈ దశలో స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఐదో వికెట్‌కు అజేయమైన 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్టీవ్ 37, క్యారీ 18 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఆసీస్ స్కోర్ 128-4గా ఉంది.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కాలుమోపింది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ ఆగస్ట్ 22న మెక్‌కే వేదికగా ప్రారంభం కానుంది.


