15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ | Duleep Trophy 2026, Vaibhav Sooryavanshi Takes Over East Zone Captaincy Following Ishan Kishan Injury, Check Details | Sakshi
Sakshi News home page

Duleep Trophy 2026: 15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ

Aug 30 2026 12:27 PM | Updated on Aug 30 2026 1:36 PM

Duleep Trophy 2026: Vaibhav Sooryavanshi Takes Over East Zone Captaincy Following Ishan Kishan Injury

టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్‌ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్‌ జోన్‌తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్‌ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్‌కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్‌ జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో  వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ మ్యాచ్‌లో వైభవ్‌ మహ్మద్‌ షమీ, ముకేశ్‌ కుమార్‌ లాంటి సీనియర్‌ బౌలర్లను హ్యాండిల్‌ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వైభవ్‌కు ఇది కేవలం​ రెండో దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌. ఓవరాల్‌గా 10వ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్‌ను వైభవ్‌ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్‌కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. 

కొద్ది సేపటికే ముకేశ్‌ కుమార్‌ సెంట్రల్‌ జోన్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (12)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్‌ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్‌ 81-3గా ఉంది. ఆర్యన్‌ జుయల్‌ (42), యశ్‌ రాథోడ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

చదవండి: భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement