source: BCCI X
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు వినియోగిస్తానని ప్రకటించాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు.
I want to use my X payout to support a needy student’s education📚
If you or someone you know is a genuinely deserving student who is struggling financially with school/college expenses, please come forward or tag them here.
I’d be happy to help in whatever way I can. Let’s… https://t.co/dVuZgwJhSy— Vaibhav Sooryavanshi (@Vaibhavsooryava) August 29, 2026
నాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి సంతోషిస్తాను. తాను చేయబోయే సహాయానికి ఒక అర్థవంతమైన ప్రయోజనం కల్పిద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఈ విషయాన్ని వైభవ్ నిన్ననే (ఆగస్ట్ 28) ఎక్స్ ద్వారా వెల్లడించాడు. 'గొప్ప విషయాలు రాబోతున్నాయి. చూస్తూ ఉండండి' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.
వైభవ్ గొప్ప మనసుకు సమస్త ప్రజానీకం ఫిదా అవుతుంది. 15 ఏళ్ల వయసులో వైభవ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని జనాలు కొనియాడుతున్నారు. వైభవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అతడికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కాగా, వైభవ్ స్వతహాగా ఇంకా స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం అతడు 10వ తరగతి విద్యార్ది. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు. వైభవ్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు.
ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. తాజాగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్యాట్‌తో రాణించలేకపోయినా, బంతితో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో గెలుపొందిన ఈస్ట్ జోన్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్‌లో ఆ జట్టు సెంట్రల్ జోన్‌తో తలపడనుంది.
చదవండి: టీ20 క్రికెట్‌లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా


