పాఠాలు నేర్వని పాక్‌.. ఇంగ్లండ్ దెబ్బ‌కు 110 రన్స్‌కే ఆలౌట్‌ | Pakistan-110 Runs-All-Out-England-Gets-180 Runs Lead-2nd-Test-Lords | Sakshi
Sakshi News home page

పాఠాలు నేర్వని పాక్‌.. ఇంగ్లండ్ దెబ్బ‌కు 110 రన్స్‌కే ఆలౌట్‌

Aug 28 2026 9:25 PM | Updated on Aug 28 2026 9:28 PM

Pakistan-110 Runs-All-Out-England-Gets-180 Runs Lead-2nd-Test-Lords

Photo Credit: Twitter

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ త‌మ దారుణ ఆట‌తీరును కంటిన్యూ చేస్తోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ప‌రాజ‌యం చ‌విచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో పాఠాలు నేర్వ‌లేదు. లార్డ్స్ వేదిక‌గా మొద‌లైన రెండో టెస్టులో పాకిస్తాన్ 37.2 ఓవ‌ర్ల‌లో 110 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి పాక్ బ్యాట‌ర్లు వ‌ణికిపోయారు. 

ఓపెన‌ర్ అజాన్ అవైస్ (46), సాద్ ష‌కీల్ (16) మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఓలీ రాబిన్‌స‌న్ 4 వికెట్లు తీయ‌గా, జోఫ్రా ఆర్చ‌ర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు ప‌డగొట్టాడు. దీంతో ఇంగ్లండ్‌కు 180 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

అంత‌క‌ముందు ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 290 ప‌రుగుల‌కు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధ‌సెంచ‌రీలు సాధించ‌గా, గ‌స్ అకిన్‌స‌న్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ 4 వికెట్లు తీయ‌గా, మొహ‌మ్మ‌ద్ అలీ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

 గాయం కారణంగా ఇమామ్‌-ఉల్‌-హక్‌ బ్యాటింగ్‌కు రాకపోవడంతో పాకిస్తాన్‌ 9 మంది బ్యాటర్లతోనే ఆటను కొనసాగించింది. దీంతో తొమ్మిదో వికెట్‌ పడిన తర్వాత పాక్‌ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.​

చదవండి: టీ20 క్రికెట్‌లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన పసికూన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement