ఆర్చ‌ర్ అరుదైన ఫీట్‌.. టెస్టు చ‌రిత్ర‌లో రెండోసారి మాత్ర‌మే! | Jofra-Archer-Only-2nd Bowler-6-Balls-90MPH-Single-Over-Test History | Sakshi
Sakshi News home page

ఆర్చ‌ర్ అరుదైన ఫీట్‌.. టెస్టు చ‌రిత్ర‌లో రెండోసారి మాత్ర‌మే!

Aug 28 2026 6:38 PM | Updated on Aug 28 2026 6:53 PM

Jofra-Archer-Only-2nd Bowler-6-Balls-90MPH-Single-Over-Test History

Photo Credit: Twitter

లార్డ్స్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ అరుదైన ఫీట్ న‌మోదు చేశాడు. ఒక ఓవ‌ర్‌లో ఆరు బంతులు గంట‌కు 90 మైళ్ల వేగంతో విసిరి స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇందులో ఐదు బంతులు గంట‌కు 92 మైళ్ల వేగంతో విస‌ర‌గా, మ‌రో బంతిని 94 మైళ్ల వేగంతో వేయ‌డం విశేషం. 

ఆర్చ‌ర్ వేసిన అత్యంత వేగ‌వంత‌మైన బౌలింగ్‌లోనూ పాక్ బ్యాట‌ర్ అజ‌న్ అవైస్ ఒక ఫోర్ కూడా కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక ఓవ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆర్చ‌ర్ తన తొలి బంతిని గంట‌లకు 92 మైళ్ల వేగంతో, రెండో బంతిని గంట‌కు 94 మైళ్ల వేగంతో, మూడో బంతిని గంట‌కు 92 మైళ్ల వేగంతో, నాలుగు, ఐదు, ఆరు బంతుల‌ను కూడా గంట‌కు 92 మైళ్ల వేగంతో విసిరి స‌రికొత్త ఫీట్ న‌మోదు చేశాడు. ఇక ఆర్చ‌ర్ ఒక ఓవ‌ర్ యావ‌రేజ్ వేగం 92.33గా న‌మోదైంది.

టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు బంతుల‌ను తొంబైకి పైగా వేగంతో విస‌ర‌డం ఇది రెండోసారి మాత్ర‌మే. గ‌తంలో 2024 జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో మార్క్‌వుడ్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఆనాటి మ్యాచ్‌లో మార్క్‌వుడ్ ఒకే ఓవ‌ర్‌లో ఆరు బంతుల‌ను వ‌రుస‌గా గంట‌కు 93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2 మైళ్ల‌వేగంతో విసిరాడు. 

ఇక ఓవ‌ర్‌లో వేగం యావ‌రేజ్ 94.7గా న‌మోదైంది. త‌ద్వారా తొలి క్రికెట‌ర్‌గా మార్క్‌వుడ్ నిలిస్తే.. తాజాగా పాక్‌తో టెస్టులో ఓవ‌ర్‌లో ఆరు బంతులు 90కి పైగా స్పీడుతో విసిరిన ఆర్చ‌ర్ రెండో బౌల‌ర్‌గా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధ‌సెంచ‌రీలు సాధించ‌గా, గ‌స్ అకిన్‌స‌న్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ 4 వికెట్లు తీయ‌గా, మొహ‌మ్మ‌ద్ అలీ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 24 ప‌రుగులు చేసింది.

 

Read: 'కోహ్లి ఉండుంటే ఆ "సైంధవుడి" ఆట సాగేది కాదు!'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement