లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ఇది రూట్‌కు 168వ టెస్ట్ మ్యాచ్. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉండేది.
బ్రాడ్ తన కెరీర్‌లో ఇంగ్లండ్ తరపున 167 టెస్టులు ఆడాడు. ఈ జాబితాలో రూట్ కంటే ముందు మరో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్(188) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, స్టీవ్ వా సరసన రూట్ నిలిచాడు. ప్రస్తుతం అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(200) అగ్రస్థానంలో ఉండగా.. ఆండర్సన్(188) రెండో స్ధానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కెప్టెన్ రూట్(4)తో సహా డకెట్(17), హ్యారీ బ్రూక్(15) స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు.
ఈ క్రమంలో యువ ఆటగాళ్లు జోర్డాన్ కాక్స్(55), జేమీ స్మిత్(61) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం క్రీజులో గస్ అట్కిన్సన్(34), టంగ్(1) ఉన్నారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అలీ మూడు వికెట్లు సాధించాడు.
చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?


