నైట్‌క్లబ్‌ ఘటన ఎఫెక్ట్‌.. ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌పై వేటు | England Pacer Brydon Carse Dropped From Pakistan Test After Nightclub Incident Sparks Investigation, Check Out More Details | Sakshi
Sakshi News home page

నైట్‌క్లబ్‌ ఘటన ఎఫెక్ట్‌.. ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌పై వేటు

Aug 25 2026 7:08 AM | Updated on Aug 25 2026 10:32 AM

Brydon Carse dropped by England amid investigation into handcuff incident

source: X

ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌పై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ECB) వేటు వేసింది. పాకిస్తాన్‌తో జరగనున్న రెండో టెస్టుకు అతడిని జట్టు నుంచి తప్పించింది. డెర్బీలోని ఓ నైట్‌క్లబ్‌ వెలుపల కార్స్‌ చేతులకు బేడీలు వేసిన దృశ్యాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు కార్స్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని ECB ప్రకటించింది. ఈ వ్యవహారంపై క్రికెట్‌ రెగ్యులేటర్‌ కూడా దర్యాప్తు చేయనుంది.

కార్స్‌ స్థానంలో పేసర్‌ సోనీ బేకర్‌ను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్‌తో జూన్‌లో జరిగిన సిరీస్‌లో బేకర్‌ టెస్టు అరంగేట్రం చేశాడు.

ఇటీవల ఇంగ్లండ్‌ జట్టులో నైట్‌క్లబ్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఓ ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలోనే అప్పటి కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు.

కాగా, పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 27న లార్డ్స్‌లో ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక​్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. మూడో టెస్ట్‌ బర్మింగ్హమ్‌ వేదికగా సెప్టెంబర్‌ 9న మొదలవుతుంది. 

చదవండి: పోలీసుల అదుపులో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement