ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్‌ | Indian legends huge remark on Sonal Dinusha after SL vs IND 2026 2nd Test | Sakshi
Sakshi News home page

ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్‌

Aug 28 2026 1:02 PM | Updated on Aug 28 2026 1:29 PM

 Indian legends huge remark on Sonal Dinusha after SL vs IND 2026 2nd Test

కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.  ఓటమి ఖాయమనుకున్న చోట శ్రీలంక యువ బ్యాటర్‌ సోనల్‌ దినూషా అద్భుతం చేశాడు. దాదాపు 100 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి తన జట్టను ఓటమి నుంచి గట్టెక్కించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తన విరోచిత పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ నేపథ్యంలో సోనల్‌  దినూషాపై భారత దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"కొలంబో టెస్టులో నిజానికి భారత్‌ గెలవాల్సింది. పరీక్షల్లో  'అవుట్ ఆఫ్ సిలబస్' ప్రశ్నలా..   దినూషా భారత జట్టుకు కొరకరాని కోయ్యగా మారాడు.  'ఎవరీ కొత్త ఆటగాడు?' అని అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. డ్రా అయినప్పటికి ఇది శ్రీలంకకు ఒక విజయం లాంటిదే. 

నాలుగు రోజులకే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి రోజు చివరి సెషన్‌ వరకు తీసుకొచ్చారు. వారికి ప్రస్తుతం కేవలం ఇద్దరు మంచి స్పిన్నర్ల అవసరం ముంది. ఈ సమస్య తీరితే శ్రీలంక తమ పూర్వవైభవాన్ని తిరిగి పొందే అవకాశముంది" అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

అదేవిధంగా సోనల్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను కూడా అశ్విన్‌ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో  దినూషా ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లు చూశాను. కఠినమైన పిచ్‌లపై కూడా అతడు అద్భుతంగా ఆడాడు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. పడిక్కల్‌ కంటే బాగా ఆడాడు. పడిక్కల్‌ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌పై షాట్లు ఆడతాడు. 

కానీ అతడు మరీ ఎక్కువగా వెనక్కి వెళ్లడం వల్ల బౌల్డ్‌ అయ్యాడు. కానీ ఈ లంక కుర్రాడు ఒక్క బంతికి కూడా ఇబ్బంది పడలేదు. బంతి లెంగ్త్‌ను ముందే అంచనా వేస్తున్నాడు. భారత స్పిన్నర్లను అతడు ఆడిన స్వీప్‌ షాట్లు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అని ఈ సీఎస్‌కే లెజెండరీ స్పిన్నర్‌ కొనియాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement