వెస్టిండీస్‌ గడ్డపై పాక్‌ ఓపెనర్‌ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో | Saim Ayubs 58-ball 102 gives Kingsmen third win | Sakshi
Sakshi News home page

CPL: వెస్టిండీస్‌ గడ్డపై పాక్‌ ఓపెనర్‌ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో

Aug 28 2026 12:07 PM | Updated on Aug 28 2026 12:07 PM

Saim Ayubs 58-ball 102 gives Kingsmen third win

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో జమైకా కింగ్స్‌మెన్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వార్నర్‌ పార్క్‌ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో జమైకా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జమైకా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

జమైకా ఇన్నింగ్స్‌లో పాక్‌ స్టార్‌ ఓపెనర్‌ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మిగితా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోపోయినప్పటికి అయూబ్‌ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 58 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో నసీం షా, హసరంగా, మెకాయ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేధనలో సెయింట్‌ కిట్స్‌ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. అండ్రీ ఫ్లెచర్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జాసన్‌ హోల్డర్‌(34), దసన్‌ శనక(35) ఆఖరిలో మెరుపులు మెరిపించారు. అయినప్పటికి మిగితా ప్లేయర్ల నుంచి పెద్దగా సహకరం లేకపోవడంతో పేట్రియాట్స్‌ ఓటమి చవిచూసింది.
చదవండి: భారత జట్టులో వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌.. కారణమిదే?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement