లార్డ్స్ టెస్ట్‌లో పొలిటికల్ హీట్.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డును బెదిరించిన పీసీబీ! | Pakistan Refused To Take Field In 2nd Test Over Imran Khans Sons Interview During Lunch Break, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. ఆట బాయ్‌కట్‌ చేస్తామంటూ పాక్‌ బెదరింపులు!

Aug 28 2026 9:32 AM | Updated on Aug 28 2026 9:39 AM

Pakistan Refused To Take Field In 2nd Test Over Imran Khans Sons Interview: Report

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఆట లంచ్‌ విరామం సందర్భంగా ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. లంచ్‌ బ్రేక్‌లో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కుమారులతో బ్రిటీష్‌  బ్రాడ్‌కాస్టర్ 'స్కై స్పోర్ట్స్' ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. 

అయితే ఈ ఇంటర్వ్యూను  లంచ్ విరామంలో ప్రసారం చేయవద్దని స్కై స్పోర్ట్స్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఇంటర్వ్యూను టెలికాస్ట్‌ చేస్తే ఆటను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించినట్లు 'ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫో' తమ కథనంలో పేర్కొం‍ది. కానీ పీసీబీ బెదిరింపులు పట్టించుకోని స్కై స్పోర్ట్స్ యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూను టెల్‌కాస్ట్‌ చేసింది. 

ప్రసారం అయినప్పటికి పాక్‌ ఆటగాళ్లు లంచ్‌ బ్రేక్‌ అనంతరం తిరిగి మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలు పీసీబీ అధికారులతో చర్చలు జరిపి శాంతింపజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇమ్రాన్‌ కుమారులు సులైమాన్, కాసిమ్‌లతో ఈ ఇంటర్వ్యూను ఇంగ్లండ్‌ దిగ్గజం మైఖేల్ అథర్టన్ 18 నిమిషాల పాటు నిర్వహించారు. 

జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ ప్రధాన మంత్రికి రాసిన లేఖ రాసిన 21 మంది కెప్టెన్లలలో మైఖేల్ అథర్టన్ ఒకరు.  ఇక జైలులో ఉన్న తమ తండ్రి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆథర్టన్‌తో ఇంటర్వ్యూలో సులైమాన్, కాసిమ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: PAK vs ENG: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న పాకిస్తాన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement