పాకిస్తాన్ జట్టును ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మరోసారి ఎగతాళి చేశాడు. లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో పాక్ గెలవాలంటే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కనీసం 250కు పైగా పరుగులు చేయాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా హెడ్డింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు బాబర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.
దీంతో హెడ్డింగ్లీ టెస్టులో పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది. పర్యాటక పాక్ జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే బాబర్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో లార్డ్స్ టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పాక్ జట్టుపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.
రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు పోటీ ఇవ్వాలంటే పాకిస్తాన్‌కు అదృష్టం చాలా అవసరం. లార్డ్స్‌లో పాక్ గెలవాలంటే బాబర్ ఆజం కనీసం 250 పరుగులైనా చేయాల్సి ఉంటుంది. పాక్ జట్టులో సరైన ప్లేయర్లు లేరు. కాబట్టి టీమ్ మేనెజ్‌మెంట్ ఇలాంటి అద్భుతాలు జరగాలని ఆశించాలని బ్రాడ్ పేర్కొన్నాడు.
కాగా బాబర్ ఆజం గత కొంత కాలంగా టెస్టు క్రికెట్‌లో తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచినప్పటికి.. గత నాలుగేళ్ల నుంచి మూడంకెల మార్క్‌ను అందుకోలేకపోతున్నాడు. అతడు చివరగా 2022లో టెస్టు సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాబర్ డబుల్ సెంచరీ సాధించడం ఆసాధ్యం.
చదవండి: Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్


