లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు చేసిన రూట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. 24 పరుగులు చేసి మహ్మద్ అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు అతడు దొరికిపోయాడు.
ఈ మ్యాచ్‌లో రూట్ ఘోరంగా విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. 35 ఏళ్ల రూట్ ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 7,594 రన్స్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది.
పాంటింగ్ ఆస్ట్రేలియాలో 7,578 టెస్టు రన్స్ చేశాడు. లార్డ్స్ టెస్టులో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాంటింగ్‌ను రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(7216), శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(7167) మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నారు.
పట్టు బిగించిన ఇంగ్లండ్
ఇక ఈ రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రూట్ సేన ప్రస్తుతం 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: ఐదో స్థానం.. అయినా రూ. 50 లక్షల నజరానా ఎందుకంటే?


