శ్రీలంక క్రికెట్‌ జట్టుకు డబుల్‌ షాక్‌ | Sri Lanka Captain Ruled Out Of T20I Series vs England | Sakshi
Sakshi News home page

ENG vs SL: శ్రీలంక క్రికెట్‌ జట్టుకు డబుల్‌ షాక్‌

Sep 4 2026 3:14 PM | Updated on Sep 4 2026 4:10 PM

Sri Lanka Captain Ruled Out Of T20I Series vs England

ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. లంకా ప్రీమియర్ లీగ్‌ సమయంలో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన మెండిస్‌.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధ్రువీకరించింది. కాగా ఈ గాయం కారణంగానే స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కూ కుశాల్‌ దూరమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ నుంచి కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక అతడితో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ బినుర ఫెర్నాండో వెన్ను గాయం కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అందుబాటులో లేడు.

దీంతో మెండిస్ స్దానంలో యువ బ్యాటర్ పవన్ రత్నాయకేను జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా  బినుర ఫెర్నాండో స్థానంలో ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మదుశంక జట్టులోకి వచ్చాడు. కాగా కుశాల్ మెండిస్ అందుబాటులో లేకపోవడంతో  చరిత్ అసలంక జట్టును నడిపించనున్నాడు. ఇక ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.

శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, లహిరు ఉదార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్‌), జనిత్ లియానాగే, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, తరిందు రత్నాయకే, దుష్మంత చమీర, ఈషాన్ , మలింగ, నువాన్ తుషార, దిల్షాన్ మధుశంక, పవన్ రత్నాయక్.
చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన‌ క‌శ్మీర్ సంచ‌ల‌నం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement