భారత్‌తో రెండో టెస్టు.. శ్రీలంక జట్టులోకి ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు | Sri Lanka squad for 2nd Test vs India: Mishara, Arachchige added, Chandimal misses due to injury | Sakshi
Sakshi News home page

IND vs SL: భారత్‌తో రెండో టెస్టు.. శ్రీలంక జట్టులోకి ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు

Aug 21 2026 4:54 PM | Updated on Aug 21 2026 5:17 PM

Sri Lanka squad for 2nd Test vs India: Mishara, Arachchige added, Chandimal misses due to injury

PC: X

కొలంబో వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టులో కీలక మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్లు కుశాల్ మెండిస్‌, పాథుమ్ నిస్సాంక గాయాల కారణంగా రెండో టెస్టుకూ దూరమయ్యారు.

మరోవైపు తొలి టెస్టులో కాన్కషన్ (తలకు దెబ్బతగలడం)కు గురైన వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమల్ సైతం రెండో టెస్టుకు అందుబాటులో లేడు. దీంతో యువ బ్యాటర్‌ కామిల్ మిషార, ఆల్‌రౌండ‌ర్లు సహన్ అరచ్చిగెలను జట్టులో లంక సెలక్టర్లు చేర్చారు. 

ఇప్ప‌టికే శ్రీలంక త‌ర‌పున ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అరచ్చిగె.. కొలంబో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. 30 ఏళ్ల సహన్‌కు ఫ‌స్ట్ క్రికెట్‌లో అద్భుత‌మైన రికార్డు ఉంది. అరచ్చిగె ఇప్పటివరకు 85 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 4365 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు 25 ఏళ్ల  కామిల్ మిషార కూడా ఇప్పటివకే లంక తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టాపార్డర్‌లో దూకుడుగా ఆడడం అతడి స్పెషాలిటి. అతడు సైతం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యుత్తమ గణంకాలు సాధించాడు. ఇప్పటివరకు 49 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన మిషార..3521 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 187గా ఉంది. కాగా గాలే వేదికగా తొలి టెస్టులో శ్రీలంక 165 పరుగుల తేడాతో చిత్తు అయిన సంగతి తెలిసిందే.

రెండో టెస్టుకు శ్రీలంక జట్టు: లహిరు ఉదార, కామిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సహన్ అరచ్చిగె, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత్ ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.
చదవండి: IND vs SL: శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement