source: X
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత యాషెస్ సిరీస్‌కు ముందు చేసిన తప్పిదాన్ని మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంది. గత యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా నేరుగా బరిలోకి దిగింది. ఫలితంగా 1-4తో సిరీస్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో అలాంటి తప్పిదం జరగకుండా ఇంగ్లండ్ ముందుగా జాగ్రత్త పడింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా XIతో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. నవంబర్ 7న పెర్త్‌లోని వాకా మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
కాగా, హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడేందుకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా XIతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 13న పెర్త్‌లో తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 15న అడిలైడ్‌లో రెండో వన్డే, నవంబర్ 18న హోబర్ట్‌లో మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు జరగనుంది.
ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇటీవల శ్రీలంక, భారత్‌పై వన్డే సిరీస్‌లు గెలిచిన బలమైన జట్టుతో ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారీ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం విండీస్ పర్యటనకు టీమిండియా..!


