భారీ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం విండీస్‌ పర్యటనకు టీమిండియా..! | INDIA WILL TOUR WEST INDIES IN JULY AND AUGUST 2027 SAYS REPORTS | Sakshi
Sakshi News home page

భారీ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం విండీస్‌ పర్యటనకు టీమిండియా..!

Oct 5 2026 5:50 PM | Updated on Oct 5 2026 6:15 PM

INDIA WILL TOUR WEST INDIES IN JULY AND AUGUST 2027 SAYS REPORTS

source: X

భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు వచ్చే ఏడాది వరకు వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది. ఈ మధ్యలో మరో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కూడా యాడ్‌ అయ్యేలా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం, టీమిండియా వచ్చే ఏడాది జులై, ఆగస్ట్‌ నెలల్లో కరీబియన్‌ (వెస్టిండీస్‌) పర్యటనుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ పర్యటనలో భారత్‌ మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు కలిపి మొత్తం 10 మ్యాచ్‌లతో భారీ ద్వైపాక్షిక సిరీస్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లలోని కొన్ని మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలోనూ జరిగే అవకాశం ఉందని సమాచారం. 

ఈ షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ, క్రికెట్ వెస్టిండీస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాత మ్యాచ్‌ల తేదీలు, వేదికలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌తో కలుపుకుంటే ఇప్పటినుంచి వచ్చే ఏడాది పూర్తయ్యేవరకు భారత ఆటగాళ్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు. 

త్వరలో భారత్‌ వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఆతర్వాత మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌కు వెళ్తుంది. దాని తర్వాత శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌, ఆతర్వాత జింబాబ్వేతో వన్డే సిరీస్‌, దాని తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌.. ఐపీఎల్‌, ఆసియా కప్‌ ఇలా వరుస పెట్టి భారత్‌ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ బిజీ షెడ్యూల్‌కు మరో విండీస్‌ సిరీస్‌ తోడైతే అభిమానులకు ప్రతి రోజు క్రికెట్‌ పండుగే.

ఇదిలా ఉంటే, వెస్టిండీస్‌ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలోనే ఉన్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ పూర్తి చేసింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం​ చేసుకుంది. అక్టోబర్‌ 6 నుంచి ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. 

ఇదీ చదవండి: విధ్వంసం సృష్టించిన పూరన్‌



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement