source: X
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ ప్రారంభమైన తొలి టెస్ట్‌లో (రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా) భారత పేసర్లు నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే (మూడో బంతికే) న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టాడు. వారి కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఖాతా తెరవనివ్వకుండానే క్లీన్ బౌల్డ్ చేశాడు.
అనంతరం నాలుగో ఓవర్‌లో (రెండో బంతికి) అన్షుల్ కంబోజ్ చెలరేగాడు. 4 పరుగులు చేసిన మరో ఓపెనర్ డెవాన్ కాన్వేను (పంత్‌కు క్యాచ్ ఇచ్చి) పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత కొద్ది సేపు రచిన్ రవీంద్ర (15) ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. ఆసారి ఆకాశ్‌దీప్ రచిన్‌ను ఔట్ (పంత్‌కు క్యాచ్) చేసి న్యూజిలాండ్‌ను దెబ్బేశాడు.
పరుగు వ్యవధిలో బుమ్రా మరోసారి తన ప్రతాపం చూపాడు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను ఒక్క పరుగుకే ఔట్ (యశస్వి జైస్వాల్‌కు క్యాచ్) చేశాడు. 29 ఓవర్‌లో బుమ్రా మరోసారి న్యూజిలాండ్‌ను దెబ్బేశాడు. వికెట్‌కీపర్ టామ్ బ్లండల్ (5)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ 70 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ (66), గ్లెన్ ఫిలిప్స్ (42) ప్రతిఘటిస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయమైన 70 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. 48.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 140-5గా ఉంది.
తుది జట్లు..
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ.
ఇదీ చదవండి: IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్


