source: X
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన మైలురాయిని తాకాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్ల జాబితాలో జవగల్ శ్రీనాథ్ (236 వికెట్లు)ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి (237 వికెట్లతో) ఎగబాకాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (434) అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ మొదలైన మొదటి టెస్ట్‌లో 3 వికెట్లు తీయడంతో ఈ ఘనత సాధించాడు.
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసి భారత పేసర్లు
కపిల్ దేవ్ - 434
జహీర్ ఖాన్ - 311
ఇషాంత్ శర్మ - 311
జస్ప్రీత్ బుమ్రా - 237
జావగల్ శ్రీనాథ్ - 236
ఓవరాల్‌గా భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్ (537), కపిల్ దేవ్ (434) ఉన్నారు.
కాగా, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బుమ్రా (3 వికెట్లు)తో పాటు అన్షుల్ కంబోజ్, ఆకాశ్‌దీప్ (తలో వికెట్) చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు 70 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో హెన్రీ నికోల్స్ (81 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (64 నాటౌట్) ఆ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయమైన 109 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 59.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 179-5గా ఉంది.
ఇదీ చదవండి: IND VS NZ 1st Test Day 1: నిప్పులు చెరిగిన భారత పేసర్లు


