విధ్వంసం సృష్టించిన పూరన్‌ | Nicholas Pooran turned the Canada Super60 final into his own batting show | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన పూరన్‌

Oct 5 2026 5:05 PM | Updated on Oct 5 2026 5:14 PM

Nicholas Pooran turned the Canada Super60 final into his own batting show

source: X

వాంకోవర్ యాంకర్స్‌తో జరిగిన కెనడా సూపర్ 60 సీజన్-2 ఫైనల్లో టొరంటో సిక్సర్స్ ఆటగాడు, విండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ చెలరేగిపోయాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 23 బంతుల్లో రెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 67 పరుగులు (291.30 స్ట్రైక్‌రేట్‌తో) చేశాడు. ఫలితంగా అతడి జట్టు వాంకోవర్ యాంకర్స్‌పై ఘన విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకుంది. అంతకుముందే మహిళల విభాగంలోనూ టైటిల్‌ సాధించిన టొరొంటో జట్టు.. టోర్నీ చరిత్రలో అరుదైన డబుల్ సాధించింది.

చెలరేగిన పీనార్‌
మొదట బ్యాటింగ్ చేసిన వాంకోవర్ యాంకర్స్ 60 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓబస్ పీనార్ 21 బంతుల్లోనే అజేయంగా 82 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ మొయిన్ అలీ 18 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

పూరన్ విధ్వంసం.. చివరి బంతికి విజయం
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టొరంటో సిక్సర్స్‌కు నికోలస్ పూరన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతడికి కెప్టెన్ కీరన్ పొలార్డ్ (13 బంతుల్లో 35 పరుగులు), డేనియల్ సామ్స్  (9 బంతుల్లో అజేయంగా 25 పరుగులు) సహకరించారు. దీంతో సిక్సర్స్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇదీ చదవండి: కీలక టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా భువీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement