source: X
త్వరలో పాకిస్తాన్‌లో జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా కుసాల్ మెండిస్ వ్యవహరించనున్నాడు. గాయంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ పథుమ్ నిస్సాంకకు కూడా జట్టులో చోటు దక్కింది.
అయితే అతను పాకిస్తాన్‌కు ప్రయాణిస్తాడా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై అతని ప్రయాణం ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.
మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు వెన్ను కింది భాగంలో నొప్పి కారణంగా అతడిని స్వదేశానికి పంపించారు. అప్పటినుంచి అతడు రిహాబ్‌లోనే ఉన్నట్లు సమాచారం.
బలమైన బ్యాటింగ్ లైనప్
కుశాల్ మెండిస్‌తో పాటు అవిష్క ఫెర్నాండో, సహన్ ఆరాచిగే, కమిందు మెండిస్, కమిల్ మిశారా, పవన్ రత్నాయకే బ్యాటింగ్ విభాగంలో ఉన్నారు. దసున్ షనక, జనిత్ లియానాగే కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ విభాగం అనుభవం, యువ ఆటగాళ్ల కలయికతో బలంగా కనిపిస్తోంది.
కీలక బౌలర్లకు చోటు
బౌలింగ్ విభాగంలో అసిత ఫెర్నాండో, సచిందు కొలంబేజ్, దిల్షాన్ మధుశంక తిరిగి జట్టులోకి వచ్చారు. ఎషాన్ మలింగ, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీరా కూడా జట్టులో ఉన్నారు. అయితే నువాన్ తుషారకు మాత్రం చోటు దక్కలేదు. దునిత్ వెల్లాలగే కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అక్టోబర్ 18 నుంచి ప్రారంభం
ట్రై సిరీస్‌లో పాకిస్తాన్, శ్రీలంకతో పాటు ఇంగ్లండ్ జట్టు పాల్గొంటుంది. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.
ట్రై సిరీస్‌కు శ్రీలంక వన్డే జట్టు
కుశాల్ మెండిస్ (కెప్టెన్), సహన్ ఆరాచిగే, దుష్మంత చమీరా, సచిందు కొలంబేజ్, అవిష్క ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, జనిత్ లియానాగే, దిల్షాన్ మధుశంక, ఎషాన్ మలింగ, కమిందు మెండిస్, కమిల్ మిశారా, పాథుమ్ నిస్సాంక, పవన్ రత్నాయకే, దసున్ షనక, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లాలగే
ఇదీ చదవండి: విండీస్ ప్లేయర్ అరుదైన రికార్డు


