source: X
పాకిస్తాన్ క్రికెట్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ దేశ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు. ఏషియన్ గేమ్స్‌లో తాత్కాలిక సారధిగా వ్యవహరించిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఫర్హాన్ ఛార్జ్ తీసుకుంటాడు. ఇప్పటివరకు పాక్ టీ20 కెప్టెన్‌గా సల్మాన్ అఘా వ్యవహరించాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్ అక్టోబర్ 9, 11, 13 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదికి చోటు దక్కలేదు. అయితే ఈ ఇద్దరినీ ఆతర్వాత పాక్‌లోనే జరిగే వన్డే ట్రై సిరీస్‌కు ఎంపిక చేశారు.
ఈ ట్రై సిరీస్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో పాక్, శ్రీలంకతో పాటు ఇంగ్లండ్ పాల్గొంటుంది. వన్డే టోర్నీలో పాక్ కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది వ్యవహరిస్తాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు
సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ ఇమ్రాన్, ఖ్వాజా నఫే (వికెట్‌కీపర్), మాజ్ సదాఖత్, నసీమ్ షా, రజావుల్లా, సైమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాదాబ్ ఖాన్, సుఫియాన్ ముకీమ్.
వన్డే ట్రై సిరీస్ కోసం పాక్ జట్టు
షాహీన్ అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ నవాజ్, ఘాజీ ఘోరి (వికెట్‌కీపర్), నసీమ్ షా, రజావుల్లా, సాద్ బైగ్ (వికెట్‌కీపర్), సైమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్, సుఫియాన్ ముకీమ్
ఇదీ చదవండి: రేపే విండీస్‌తో తొలి టీ20.. భారీ రికార్డులపై కన్నేసిన అభిషేక్ శర్మ


