source: X
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. లక్నో వేదికగా తొలి మ్యాచ్ రేపు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.
74 పరుగులు చేస్తే..
రేపటి మ్యాచ్‌లో అభిషేక్ 74 పరుగులు చేస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగుల మార్కును తాకుతాడు. తద్వారా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ తర్వాత ఈ మైలురాయిని తాకిన ఆరో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. 2024లో జింబాబ్వే మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం చేసిన అభిషేక్, ఇప్పటివరకు 61 ఇన్నింగ్స్‌ల్లో 1926 పరుగులు చేశాడు.
7 ఫోర్లు కొడితే..
టీ20ల్లో ఇప్పటివరకు 185 ఫోర్లు బాదిన అభిషేక్.. రేపటి మ్యాచ్‌లో మరో ఏడు ఫోర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను అధిగమిస్తాడు. వీరిద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 191 ఫోర్లు సాధించారు.
మరో 31 పరుగులు చేస్తే..
సొంతగడ్డపై టీ20ల్లో అభిషేక్ శర్మ రికార్డు ఆకట్టుకునేలా ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 969 పరుగులు చేసిన అతడు, రేపటి మ్యాచ్‌లో మరో 31 పరుగులు చేస్తే స్వదేశంలో 1000 టీ20 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేస్తాడు. తద్వారా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ తర్వాత ఈ మైలురాయిని తాకిన ఏడో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.
ఇదీ చదవండి: భారీ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం విండీస్ పర్యటనకు టీమిండియా..!


